డ్రైనేజ్ సదుపాయం లేక గ్రామస్తులకు ఇబ్బందులు

డ్రైనేజ్ సదుపాయం లేక గ్రామస్తులకు ఇబ్బందులు

కృష్ణా: ఉంగుటూరు మండలం పెద్దవట్టుపల్లి గ్రామంలో రోడ్డు, డ్రైనేజీ వంటి కనీస మౌలిక సదుపాయాలు లేక స్థానిక ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ రోడ్డుపై రాకపోకలు సాగించాలంటే ఇబ్బందికరంగా మారిందని గ్రామస్తులు తెలిపారు. అధికారులు తక్షణమే స్పందించి రోడ్డు, డ్రైనేజ్ నిర్మాణం చేపట్టాలని వారు కోరుతున్నారు.