సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం.....

నిజామాబాద్: మద్నూర్ మండలంలోని ఎక్కారా తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 2024-25 విద్యా సంవత్సరానికి 6-9వ తరగతి వరకు మిగిలిన సీట్ల భర్తీకి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ ఓ ప్రకటనలో గురువారం తెలిపారు. అభ్యర్థులు www.tswreis.com వెబ్ సైట్లో ఈ నెల 23 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉందన్నారు.