బాణాసంచా యూనిట్‌ను తనిఖీ చేసిన సీఐ
VZM: కాకినాడ జిల్లాలో జరిగిన బాణాసంచా పేలుడు దృష్టిలో పెట్టుకొని బొబ్బిలి గ్రామీణ పోలీసు స్టేషన్ పరిధిలోని ఎరుకలపాకలో ఉన్న అమ్మ భగవాన్ ఫైర్ వర్క్ యూనిట్‌ను సీఐ ఎస్.శ్రీనివాస్ ఆదివారం తనిఖీ చేశారు. బాణాసంచా లైసెన్స్, పరిమితి,బాణాసంచా తయారుచేసే విధానాన్ని సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించి, యాజమాన్యానికి పలు సూచనలు చేశారు.