స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదం.. సూపర్‌వైజర్ మృతి
VSP: విశాఖ స్టీల్ ప్లాంట్‌లోని RMHP విభాగంలో జరిగిన ప్రమాదంలో కిరణ్ (28) అనే కాంట్రాక్ట్ సూపర్వైజర్ మృతి చెందారు. కన్వేయర్ బెల్ట్ రిపేర్ చేస్తుండగా అకస్మాత్తుగా పైనుంచి కింద పడటంతో, తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుడు దిబ్బపాలెం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.