VIDEO: మేకలపల్లిలో కనకదాసు చిత్రపటం ఊరేగింపు

VIDEO: మేకలపల్లిలో కనకదాసు చిత్రపటం ఊరేగింపు

సత్యసాయి: సోమందేపల్లి మండలం మేకలపల్లిలో భక్త కనకదాసు జయంతి వేడుకలు శనివారం సాయంతం ఘనంగా నిర్వహించారు. కనకదాసు చిత్రపటాన్ని పల్లకిలో ఊరేగించారు. ఈ సందర్భంగా కురుబ కృష్ణమూర్తి మాట్లాడుతూ.. మొట్ట మొదటిసారి మేకలపల్లి గ్రామంలో కనకదాసు జయంతి వేడుకలు కన్నుల పండుగగా జరుపుకున్నట్లు తెలిపారు. కనకదాసు అప్పట్లో ఓ వీర సైనికుడు అని ఆయన సేవలు గుర్తుచేసుకున్నారు.