టెన్త్ మూల్యాంకనానికి ఏర్పాటు
కోనసీమ: జిల్లాలో పదవ తరగతి మూల్యాంకనం నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రేపటి నుంచి మూల్యాంకనం చేసేందుకు అమలాపురం పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేశామని డీఈవో నాగేశ్వరావు పేర్కొన్నారు. 475 మంది ఉపాధ్యాయులు మూల్యాంకన విధుల్లో పాల్గొంటారు. 235 మంది సహాయక ఎగ్జామినర్లుగా వ్యవహిస్తారని ఆయన పేర్కొన్నారు.