శ్రీమంత కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ భార్య
సత్యసాయి: రొద్దం మండలం చిన్నకోడిపల్లి గ్రామంలో విలేకరి రామాంజి భార్య నాగమణి శ్రీమంత కార్యక్రమం బుధవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి సతీమణి బీకే కమలమ్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా కమలమ్మ నాగమణికి పసుపు, కుంకుమ పెట్టి ఆశీర్వదించారు. అనంతరం చీరను కానుకగా అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.