యాలాల చైన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్
VKB: ఈనెల 21న యాలాల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన చైన్ స్నాచింగ్ ఘటనలో పాల్గొన్న ముఠాను కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసులో భాగంగా యాలాల ఎస్సై విట్టల్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నాలుగు టీంలు 48 గంటల పాటు తీవ్రంగా శ్రమించి స్వల్ప సమయంలో కేసును చేదించారు. వారిని గుల్బర్గా కోర్టులో ప్రవేశపెట్టి యాలాల తీసుకొస్తున్నారు.