ఈవీఎంల గోడౌన్ తనిఖీ చేసిన కలెక్టర్

ఈవీఎంల గోడౌన్ తనిఖీ చేసిన కలెక్టర్

E.G: సాధారణ తనిఖీల్లో భాగంగా ఈవీఎంల గోడౌన్‌ను కలెక్టర్ పి. ప్రశాంతి పరిశీలించారు. గురువారం FCI గోడౌన్‌లో ఏర్పాటు చేసిన ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్‌ను కలెక్టర్, ఆర్డీవో ఆర్. కృష్ణనాయక్, తహసీల్దార్ పాపారావు, ఇతర రెవెన్యూ సిబ్బంది పోలీసులతో కలిసి తనిఖీ చేశారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు మేరకు ప్రతి నెలా ఈవీఎంల గోడౌన్లను తనిఖీ చేస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.