VIDEO: ఆర్టోస్ డ్రింక్స్ ఫ్యాక్టరీలో విద్యార్థుల సందడి
కోనసీమ: కె.గంగవరం మండలం దంగేరు ప్రభుత్వ హైస్కూల్ విద్యార్థులు గురువారం రామచంద్రపురంలోని ఇండస్ట్రియల్ ఏరియాను సందర్శించారు. ఫీల్డ్ ట్రిప్లో భాగంగా ఆర్టోస్ ఫ్యాక్టరీలో శీతల పానీయాల తయారీ, ప్యాకింగ్, రవాణా ప్రక్రియలను ఆసక్తిగా పరిశీలించారు. విద్యార్థులకు పారిశ్రామిక రంగంపై అవగాహన కల్పించేందుకే ఈ పర్యటన ఏర్పాటు చేసినట్లు హెచ్ఎం శ్రీనివాస్ తెలిపారు.