కనువిందు చేసిన అందమైన హరివిల్లు

PDPL: పాలకుర్తి మండలం ఈశాల తక్కల్లపల్లి గ్రామంలో బుధవారం సాయంత్రం ఆకాశంలో అందమైన హరివిల్లు కనువిందు చేసింది. ఒకవైపు వర్షం పడుతుండగా అకస్మాత్తుగా మేఘాల చాటున ఎండ వచ్చినప్పుడు ఇంద్రధనస్సు ఏర్పడింది. పలువురు ఇంద్రధనస్సు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో సీతమ్మ తల్లి చీరెను ఆరబెట్టుకుందని అంటూ ఆధ్యాత్మిక భావనను కామెంట్ చేస్తున్నారు.