ఉపాధి కూలి పని చేస్తూ ఓట్ల అభ్యర్థించిన ఎమ్మెల్యే

BDK: దమ్మపేట మండల పరిధిలోని రెడ్యాలపాడు, మంగాపురం గ్రామాలలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (100) రోజుల పని చేస్తున్న కార్మికుల వద్దకు బుధవారం అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వారితో పాటు కాసేపు పనిచేశారు. రానున్న లోక్ సభ ఎన్నికలలో రామసహాయం రఘురామిరెడ్డి హస్తం గుర్తుకు ఓటేయాలని అన్నారు.