శ్రీరామనవమి రథయాత్రలో పాల్గొన్న బల్లా పల్లవి
ATP: అనంతపురంలో శ్రీరామ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీరామనవమి రథయాత్ర భక్తిశ్రద్ధలతో వైభవంగా సాగింది. మార్కెట్ యార్డ్ చైర్ పర్సన్ బల్లా పల్లవి ఈ వేడుకలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. రథయాత్ర పొడవునా భక్తులతో కలిసి రామనామ స్మరణ చేస్తూ ఉత్సాహంగా సాగారు. ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.