GHMC విలీనంతో భవిష్యత్ ప్రశ్నార్థకం.?

GHMC విలీనంతో భవిష్యత్ ప్రశ్నార్థకం.?

HYD: పోచారం ఐటీ కారిడార్ జీహెచ్ఎంసీలో విలీనమైన క్రమంలో ఐటీ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఐటీ కారిడార్ వరకు వసతులు మెరుగవుతాయని ఆశిస్తున్నారు. మరోవైపు మధ్య తరగతి ప్రజలు విలీనంతో పన్ను భారం పెరుగుతుందని భయపడుతున్నారు. పరిపాలన అనుమతులకు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుందని భావిస్తున్నారు. దీంతో విలీన ప్రక్రియ కొందరికి బాగుంటే.. మరికొందరికి ఇబ్బందిగా మారనుంది.