దేవాలయ పరిశుభ్రతపై దృష్టి పెట్టండి సారు..!!

దేవాలయ పరిశుభ్రతపై దృష్టి పెట్టండి సారు..!!

RR: షాద్ నగర్ పట్టణంలోని శ్రీచౌడమ్మ గుట్ట ఆంజనేయస్వామి దేవాలయ ఆవరణలో మురుగు నీరు ప్రవహిస్తున్నా పట్టించుకునేవారు లేరని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయ ఆవరణలోకి వర్షపు నీరు రావడంతో పాటు మురుగు నీరు కూడా చేరడంతో, దానిని శుభ్రం చేసేందుకు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని భక్తులు తెలిపారు. దృష్టి సారించాలని కోరారు.