అమర్ దీప్ హీరోగా 'సుమతీ శతకం'

బుల్లితెర నటుడు అమర్ దీప్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా 'సుమతీ శతకం'. ఈ చిత్రంలో కథానాయికగా సైలీ నటిస్తోంది. ఈ సినిమాకు ఎం.ఎం. నాయుడు దర్శకత్వం వహిస్తుండగా, కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో అమర్ దీప్ ఒక మధ్యతరగతి యువకుడిలా కనిపిస్తున్నాడు.