రేపటి నుంచి శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు

రేపటి నుంచి శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు

NLR: విడవలూరు(మం) దంపూరు శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం నుంచి నిర్వహించనున్నారు. 31 అంకురార్పణ, ధ్వజారోహణం, శేష వాహన సేవ, 1న హనుమంత సేవ, 2న గరుడ సేవ, 3న కళ్యాణ మహోత్సవం, 4న పట్టాభిషేకం మహోత్సవం, 5న రథోత్సవం, 6న ఏకాంత సేవ ఉందని నిర్వాహకులు తెలిపారు. భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకోవాలని కోరారు.