నాలుగు కాళ్లతో పుట్టిన కోడిపిల్ల

నాలుగు కాళ్లతో పుట్టిన కోడిపిల్ల

ASR: హుకుంపేట(M) పెదబూరుగుపుట్టులోని కిల్లో అప్పారావు ఇంట్లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో పొదిగిన కోడిగుడ్డులో ఓ కోడిపిల్ల నాలుగు కాళ్లతో జన్మించింది. గ్రామంలో ఈ ఘటన అందరిలో ఆశక్తిని రేకెత్తించింది. ఇది చాలా అరుదైన సంఘటన కాగా, ప్రస్తుతం కోడిపిల్ల ఆరోగ్యంగానే ఉందని యజమాని తెలిపాడు.