VIDEO: 'అమ్రాబాద్‌లో కోతుల బెడదను అరికట్టాలి'
NGKL: అమ్రాబాద్ మండలంలోని మాచారం, మన్ననూరు, చింతలోనిపల్లి, పలు గ్రామాల్లో కోతుల బెడద అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు. కోతులు గుంపులు, గుంపులుగా పంట పొలాలతో పాటు ఇండ్లలో సంచరిస్తూ దాడులు చేస్తున్నాయని తెలిపారు. అధికారులు స్పందించి కోతులను అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానికులు పేర్కొన్నారు.