కుక్కలకు కుడుములు ఎందుకు వేస్తారంటే?
కోరల పౌర్ణమి నాడు యమధర్మరాజుకు పూజచేస్తే అనేక వ్యాధుల నుంచి విముక్తి కలుగుతుందని, సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటామని భక్తుల నమ్మకం. ఇక కోరల పౌర్ణమి రోజున కుడుములు చేసి వాటిని కొరికి కుక్కలకు వేయడం కొన్ని ప్రాంతాలలో కనిపిస్తుంది. శునకం కాలభైరవుడి వాహనంగా చెప్పబడుతోంది కాబట్టి, ఇలా చేయడం వల్ల ఆ స్వామి అనుగ్రహం కూడా లభిస్తుందని అంటారు.