ఉరవకొండలో సందడి చేసిన గవిమఠం సంస్థానం ఏనుగు

ATP: శ్రీ చంద్రమౌళేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని గవిమఠం సంస్థానానికి చెందిన ఏనుగు మంగళవారం ఉరవకొండకు చేరుకుంది. ఈ సందర్భంగా పట్టణ పురవీధుల్లో గజలక్ష్మి సందడి చేసింది. ఏనుగును చూసిన స్థానికులు, చిన్నారులు సందడి చేశారు. సాధారణంగా బ్రహ్మోత్సవాల సమయంలో మాత్రమే ఈ ఏనుగు వచ్చి ఉత్సవాలు ముగిసిన తరువాత కర్ణాటక రాష్ట్రం తుమకూరు వెళ్ళిపోతుంది.