గెలుపొందిన సర్పంచులకు హరీశ్ రావు అభినందనలు
MDK: జిల్లాలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచులకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించడం ప్రజల విశ్వాసానికి నిదర్శనమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికార మదంతో, పోలీసుల బలంతో ఎన్నో అడ్డంకులు సృష్టించినా, ప్రలోభాలకు లొంగకుండా పోరాడి గెలిచారని అన్నారు.