రాష్ట్రంలో 35 భరోసా కేంద్రాలు: డీజీపీ

రాష్ట్రంలో 35 భరోసా కేంద్రాలు: డీజీపీ

TG: భవనగిరిలో డీజీపీ శివధర్‌రెడ్డి భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 35 భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలీస్ స్టేషన్ వాతావరణం లేకుండా స్వేచ్ఛగా ఉండాలని.. మనసులోని బాధలు చెప్పుకోవడానికి భరోసా కేంద్రాలు ఉపయోగపడుతాయని చెప్పారు. మావోయిస్టుల లొంగుబాటు ప్రక్రియ కొనసాగుతోందన్నారు. రాష్ట్రంలో ఇంకా ఆరుగురు మావోయిస్టులే మిగిలి ఉన్నారని వెల్లడించారు.