33 సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం

AKP: కోటవురట్ల ప్రభుత్వ హైస్కూల్లో చదువుకున్న 1991-1992 బ్యాచ్, పదోవ తరగతి విద్యార్థులు ఆదివారం సమావేశం అయ్యారు. వివిధ ప్రాంతాల్లో ఉద్యోగ వ్యాపారాల్లో స్థిరపడిన వారందరు కలుసుకొని ఒకరికొకరు పలకరించుకుని కష్టసుఖాలు తెలుసుకున్నారు. అప్పటి తరగతి గదుల్లో చేసిన అల్లరి చిలిపి పనులు గుర్తుచేసుకొని పులకించి పోయారు. అప్పటి ప్రిన్సిపల్ షరీఫ్‌ను సత్కరించారు.