ముందుచూపుతో క్యాన్సర్ నివారణ: ఎమ్మెల్యే

ముందుచూపుతో క్యాన్సర్ నివారణ: ఎమ్మెల్యే

వనపర్తి: మహిళలో సంభవించే రొమ్ము, సర్వైకల్ క్యాన్సర్ మహమ్మారిని తొలి దశలోనే గుర్తించి చికిత్స చేయించడం ద్వారా ముప్పును నివారించగలమని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం వనపర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల శిబిరం నిర్వహించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఉచిత క్యాన్సర్ శిబిరం నిర్వహించామన్నారు.