కిక్కిరిసిన బస్సులు.. ప్రయాణికులు ఇబ్బందులు

కిక్కిరిసిన బస్సులు.. ప్రయాణికులు ఇబ్బందులు

MHBD: తొర్రూరు నుంచి మహబూబాబాద్, నర్సంపేటకు వెళ్లే ఆర్టీసీ బస్సులు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. దీంతో అటువైపు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆర్టీసీ అధికారులు సరిపడా బస్సులు నడపట్లేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బస్సుల కొరత తీర్చాలని స్థానికులు కోరుతున్నారు.