నీటి ఎద్దడి నివారణకై పాలకవర్గం సమావేశం

నీటి ఎద్దడి నివారణకై పాలకవర్గం సమావేశం

NZB: ధర్పల్లి మండలం దుబ్బాక గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ సరోజినీ దేవి అధ్యక్షతన పాలకవర్గ సమావేశం నిర్వహించారు. రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రామంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై చర్చించారు. ప్రజలకు నీటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నామని తెలిపారు.