కైరేవు రోడ్డుకు మోక్షం.. మొదలైన పనులు
ATP: కుందిర్పి మెయిన్ రోడ్డులోని చెర్లోపల్లి గేటు నుంచి కైరేవు గ్రామం వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న రోడ్డు కలను సాకారం చేసినందుకు స్థానిక ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు, కూటమి ప్రభుత్వానికి గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. చిరకాల కోరిక నెరవేరుతోందని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు.