VIDEO: 'లంచం తీసుకుంటూ దొరికిన సీఐ, ఎస్సై'
KDP: పులివెందుల రూరల్ CI వెంకటరమణ, సింహాద్రిపురం SI అనిల్ కుమార్‌ను ACB అధికారులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. దొంగతనం కేసులో నిందితుడికి బెయిల్ ఇప్పిస్తామని బాధితుడి వద్ద రూ.7 లక్షలు డిమాండ్ చేశారు. బాధితుడు ప్రాధేయపడడంతో రూ.2 లక్షలకు తగ్గించి, మొదట రూ.50 వేలు తీసుకున్నారు. మిగిలిన రూ.1.50 లక్షలు ఇస్తుండగా వీరిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు తెలిపారు.