12 లీటర్ల గుడుంబా పట్టివేత

12 లీటర్ల గుడుంబా పట్టివేత

NGKL: కల్వకుర్తి మండల పరిధిలోని తర్నికల్ తండా నుంచి వెంకటాపూర్ గ్రామానికి బైక్‌పై తరలిస్తున్న12 లీటర్ల సారాను పట్టుకున్నట్టు ఎక్సైజ్ సీఐ వెంకటరెడ్డి వెల్లడించారు. బుధవారం రాత్రి నిర్వహించిన తనిఖీలలో గుడుంబా పట్టుబడిందని అన్నారు. గుడుంబాను తరలిస్తున్న రాత్లావత్ రాజు అనే వ్యక్తిని అరెస్టు చేసి ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేసినట్లు సీఐ తెలిపారు.