ఊరేగింపుగా బయల్దేరిన లక్ష్మీనరసింహ స్వామి

NLR: పెంచలకోనలో బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా గోనుపల్లిలో ఇవాళ ఉదయం లక్ష్మీనరసింహ స్వామి ఉత్సవమూర్తికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారిని పల్లకీలో ఉంచి ఊరేగింపుగా పెంచలకోనకు బయల్దేరారు. దారి పొడవునా మహిళలు కర్పూర హారతులు చేపట్టారు. స్వామివారి ఊరేగింపు ముందు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.