మద్దూరులో అరుదైన జీవి

NRPT: మద్దూరులో అరుదైన పునుగు పిల్లి కనపడింది. బీజేపీ మండల అధ్యక్షుడు భవానీశంకర్ ఇంటి మెట్ల కింద ఈ జంతువు కనిపించగా, ఆయన అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఉపయోగించే పునుగు తైలం ఈ జంతువు నుంచే సేకరిస్తారు. నల్లమల అడవుల్లో కనిపించే ఈ అరుదైన జంతువును అధికారులు పట్టుకుని పిల్లలమర్రి పార్కుకు తరలించారు.