VIDEO: మోద్గులగూడెంలో పడకేసిన పారిశుద్ధం
MHBD: కురవి(M)మోద్గులగూడెంలో పారిశుద్ధ్యం పూర్తిగా క్షీణించింది. ముఖ్యంగా 9వ వార్డులో సైడ్ డ్రైనేజ్ కాలువలు అస్తవ్యస్తంగా మారాయి. చెత్తాచెదారం పేరుకుపోవడంతో మురుగు నీరు నిలిచిపోయి తీవ్ర దుర్వాసన వ్యాపిస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు అధికారులకు తెలిపిన స్పందించడం లేదని తెలిపారు. వెంటనే అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు.