ఎరువుల షాపులలో ఆకస్మిక తనిఖీలు

ప్రకాశం: సాగు పనులు ముమ్మరంగా ఉన్నందున, అన్ని రకాల ఎరువులు రైతులకు అందుబాటులో ఉంచాలని, కృత్రిమ ఎరువు కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎరువుల డీలర్లకు క్వాలిటీ కంట్రోల్ అధికారి ప్రసాద్ రావు హెచ్చరించారు. తాళ్లూరు మండలం తూర్పు గంగవరంలో ఎరువుల దుకాణాలపై గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, ఎరువుల శాంపిళ్లు సేకరించారు.