వందేభారత్ రైళ్ల షెడ్యూల్‌లో మార్పు

వందేభారత్ రైళ్ల షెడ్యూల్‌లో మార్పు

AP, TGలో నడుస్తున్న వందేభారత్ రైళ్ల షెడ్యూల్‌లో మార్పులు చేశారు. కాచిగూడ-యశ్వంత్‌పూర్-కాచిగూడ రైలు(20703/20704) ఇకపై శుక్రవారం మినహా అన్ని రోజుల్లో నడుస్తుంది. సికింద్రాబాద్-విశాఖపట్నం-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్(20707/20708) కూడా సోమవారం మినహా అన్ని రోజుల్లో నడుస్తుంది. ఈ మార్పులు డిసెంబర్‌ 4, 5 తేదీల నుంచి అమల్లోకి వస్తాయని రైల్వే అధికారులు తెలిపారు.