రూ. 2 లక్షల కోట్లకు చేరిన కలెక్షన్స్
భారత ఆర్థిక వ్యవస్థలో జీఎస్టీ వసూళ్లు సరికొత్త మైలురాయిని చేరుకున్నాయి. గత మార్చి నెలలో స్థూల జీఎస్టీ వసూళ్లు 8.8 శాతం వృద్ధిని నమోదు చేసి, ఏకంగా రూ. 2 లక్షల కోట్ల మార్కును తాకినట్లు ప్రభుత్వ అధికారిక గణాంకాలు వెల్లడించాయి. దేశీయంగా ఆర్థిక కార్యకలాపాలు వేగవంతం కావడం, వినియోగం పెరగడం వల్లే ఈ స్థాయిలో వసూళ్లు సాధ్యమయ్యాయని నిపుణులు భావిస్తున్నారు.