పునాదిపాడులో అగ్నిప్రమాదం.. టీస్టాల్ దగ్ధం

పునాదిపాడులో అగ్నిప్రమాదం.. టీస్టాల్ దగ్ధం

కృష్ణా: పునాదిపాడులో స్థానిక కోలవెన్ను రోడ్డు టర్నింగ్ వద్ద విద్యుత్ స్థంభానికి ఏర్పాటు చేసిన బోర్డులో షార్ట్ సర్క్యూట్ కారణంగా బుధవారం రాత్రి మంటలు చెలరేగాయి. మంటలు పక్కనే ఉన్న టీస్టాల్‌కు వ్యాపించడంతో క్షణాల్లో టీస్టాల్ దగ్ధమైంది. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ అధికారులు అక్కడికి చేరుకొని, సరఫరాను నిలిపివేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.