కనకదుర్గమ్మను దర్శించుకున్న అచ్చెన్నాయుడు

కనకదుర్గమ్మను దర్శించుకున్న అచ్చెన్నాయుడు

SKLM: విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గ అమ్మవారిని టెక్కలి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కుటుంబ సమేతంగా బుధవారం దర్శించుకున్నారు. అర్చకులు తొలుత ఆయనకు స్వాగతం పలికారు. ఈ మేరకు అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఈవో శాలువాతో మంత్రిని సన్మానించారు. వేద పండితులు ఆశీర్వాదంతో దీవించి అమ్మవారి తీర్థ ప్రసాదాలను వారికి అందజేశారు.