కొనసాగుతున్న మాజీ ఇంచార్జ్ HM ఆగడాలు
BHPL: నిజాంపల్లి ప్రభుత్వ పాఠశాలలో ప్రీ-ప్రైమరీ బడ్జెట్ నిధుల వినియోగంపై వివాదం చెలరేగింది. 2024-25 నిధులను మాజీ ఇన్‌చార్జ్ హెచ్‌ఎం ఉమాదేవి వ్యక్తిగత అవసరాలకు వినియోగించారని స్థానికులు ఆరోపించారు. అనంతరం సమావేశంలో ఆమె డబ్బులు తిరిగి అప్పగించినట్లు సమాచారం. అయితే గురువారం ఎవరికి తెలియకుండా రూ.30 వేలతో స్పోర్ట్స్ కిట్ తీసుకురావడం మరింత చర్చనీయాంశమైంది.