రేపు వైటీపీఎస్‌కు డిప్యూటీ సీఎం భట్టి రాక

NLG: దామచర్ల మండలం వీర్లపాలెం సమీపంలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్(వైటీపీఎస్)కు శుక్రవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు నల్లమాద ఉత్తంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ రానున్నారు. పవర్ ప్లాంట్‌లోని యూనిట్-1 ను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నట్లు అధికారులు తెలిపారు.