VIDEO: రిఫైనరీలో రెండో రోజుకార్మికుల ఆందోళన

VIDEO: రిఫైనరీలో రెండో రోజుకార్మికుల ఆందోళన

 AKP: మాకవరపాలెం మండలం రాచపల్లి వద్ద పయనీర్ (ఆన్ రాక్) రిఫైనరీలో కార్మికుల రెండో రోజు ఇవాళ కూడా ఆందోళన చేపట్టారు. రోజుకు 8 గంటల బదులు 12 గంటలు పనిచేయిస్తున్నారని, తగిన వేతనాలు ఇవ్వడం లేదని ఆరోపిస్తూ సబ్‌కాంట్రాక్ట్ కార్మికులు విధులు బహిష్కరించి రిఫైనరీ గేటు ముందు నిరసనకు దిగారు. యాజమాన్యం వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.