రేపు పుంగనూరులో ఉచిత కంటి వైద్య శిబిరం

రేపు పుంగనూరులో ఉచిత కంటి వైద్య శిబిరం

CTR: పుంగనూరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రేపు (ఆదివారం ) పట్టణంలోని బిఎంఎస్ క్లబ్ ఆవరణంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు లయన్స్ జిల్లా చైర్మన్ డాక్టర్ పి. శివ తెలిపారు. శనివారం పుంగనూరులో ఆయన మాట్లాడుతూ... కుప్పం PES వైద్య కళాశాల వారి సహకారంతో ఉదయం 10 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.