'యువత మత్తు పదార్థాలకు బానిసలు కావొద్దు'
ASF: యువత మత్తు పదార్థాలకు బానిసై భవిష్యత్తును పాడు చేసుకోవద్దని దహెగాం ఎస్ఐ విక్రం ఓ ప్రకటనలో సూచించారు. డ్రగ్స్ మీ ఆరోగ్యాన్ని కాదు అందమైన జీవితాన్ని చిదిమేస్తుందన్నారు. మత్తుపదార్థాలు సేవించడం చట్టరీత్య నేరమని, శిక్ష తప్పదని హెచ్చరించారు. డ్రగ్స్ నివారణ, సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1908ని సంప్రదించాలని పేర్కొన్నారు.