BRS చేసిన అభివృద్ధి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి: మాజీ MLA
MHBD: కురవి మండల పరిధిలోని ప్రతి గ్రామంలో గులాబీ జెండా ఎగిరేలా ప్రతి ఒక్క కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని మాజీ MLA రెడ్యానాయక్ అన్నారు. సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో అయ్యగారిపల్లి గ్రామంలో శనివారం BRS మండల స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో రెడ్యానాయక్ పాల్గొని మాట్లాడారు. గత 10ఏళ్లలో BRS చేసిన అభివృద్ధి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు.