ఈవీఎం గోడౌన్‌లో కలెక్టర్ తనిఖీ

ఈవీఎం గోడౌన్‌లో కలెక్టర్ తనిఖీ

పల్నాడు: మార్కెట్ యార్డులోని ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్ కృతిక శుక్లా పరిశీలించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈవీఎంలు, సీసీ కెమెరాలు, అగ్నిమాపక యంత్రాల పనితీరును పరిశీలించారు. ఈసీ నిబంధనల మేరకు గోడౌన్‌కు పటిష్ట బందోబస్తు కల్పించామన్నారు. భద్రతా సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు.