ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించండి: కలెక్టర్

BDK: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలులోకి తెచ్చిన భూభారతి చట్టం కింద రైతులు, ప్రజల నుంచి ఆన్‌లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలన జరిపిన మీదట, క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు.పెండింగ్ భూభారతి దరఖాస్తులు, రేషన్ కార్డులు, ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు.