రూ.5 లక్షలు పెట్టి అఖండ టికెట్ కొన్న ఎమ్మెల్యే

రూ.5 లక్షలు పెట్టి అఖండ టికెట్ కొన్న ఎమ్మెల్యే

CTR: బాలకృష్ణ నటించిన అఖండ-2 సినిమా టికెట్టును చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ రూ.5 లక్షలకు కొనుగోలు చేశారు. గురువారం బాలకృష్ణ అభిమానుల సంఘం నాయకులు ఎమ్మెల్యేను కలిసి సినిమా టికెట్టును అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బాలకృష్ణ అభిమానిగా సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.