స్టేషన్‌కు వచ్చేవారికి అండగా ఉంటాం: ఎస్సై

స్టేషన్‌కు వచ్చేవారికి అండగా ఉంటాం: ఎస్సై

GNTR: 2018 బ్యాచ్ ఎస్సై కే.తరంగిణి ఆదివారం సాధారణ బదిలీల్లో భాగంగా గుంటూరు మహిళా పోలీస్ స్టేషన్ ఎస్సైగా బాధ్యతలు చేపట్టారు. గతంలో అరండల్ పేట, నల్లపాడు, కొత్తపేట స్టేషన్లలో పనిచేసిన ఆమె, మహిళా బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని తెలిపారు. మహిళా పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఒక్కరికీ అండగా ఉంటానని ఆమె హామీ ఇచ్చారు.