'లక్ష్యం' అనే ఔషధంతో మతిమరుపునకు చెక్..!
మీరు మీ వయసును తగ్గించే అద్భుతమైన ఔషధాన్ని తయారు చేసుకోవచ్చు. దాని రహస్యం ఒకటే 'లక్ష్యం'. మీరొక సవాలుతో కూడిన, అర్థవంతమైన లక్ష్యాన్ని పెట్టుకొని.. దాన్ని సాధించడానికి నిరంతరం చురుగ్గా పనిచేయాలి. ఆ లక్ష్యం పూర్తయ్యాక మరొక ఉన్నత లక్ష్యంపై దృష్టి పెట్టాలి. ఇలా చేసేవారిలో వయసు పెరుగుదలతో వచ్చే మతిమరుపు ప్రమాదం ఇతరులకంటే 2.4 రెట్లు తక్కువగా ఉంటుందని అధ్యయనంలో తేలింది.