నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల
KMR: నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి పంట సాగు కోసం నాలుగో విడతలో భాగంగా ఆదివారం 2,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఏఈఈ అక్షయ్ కుమార్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 17.802 టీఎంసీలు కాగా ప్రస్తుతం 12.881 టీఎంసీల నీటి నిల్వ ఉంది. కాలువల పరిసర ప్రాంతాల ప్రజలు, రైతులు, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలన్నారు.